France: ఫ్రాన్స్​ లో థర్డ్​ వేవ్​.. లాక్​ డౌన్​ ప్రకటించిన అధ్యక్షుడు మెక్రాన్​

We Will Lose Control If We Dont Move Now Macron Orders Third Lockdown
  • దేశవ్యాప్తంగా మూడో లాక్ డౌన్ అమలు
  • కరోనా కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం
  • పరిస్థితి చేయి దాటిపోతుందన్న మెక్రాన్
కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న వేళ ఫ్రాన్స్ మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది. కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాలలను మరో మూడు వారాల పాటు మూసేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయన అన్నారు.

కరోనాను అడ్డుకోవాలంటే ఇదే మంచి నిర్ణయమన్నారు. చాలా నెలల పాటు స్కూళ్లను తెరిచే ఉంచామని, అయినా కూడా పొరుగు దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని ఆయన గుర్తు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తామని చెప్పారు. ఏప్రిల్ మూడో వారం నుంచి 60 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకాలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల నుంచి 50 ఏళ్లు దాటిన వారికీ ఇస్తామన్నారు.

జూన్ మధ్య నాటికి 3 కోట్ల మందికి కరోనా టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నామని ఆయన వివరించారు. ముందే పెట్టుకుంటున్న లాక్ డౌన్, వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా కరోనా కట్టడి అవుతుందని, మే మూడో వారం నాటికి పరిస్థితి అదుపులోకి వస్తే మళ్లీ లాక్ డౌన్ ఎత్తేస్తామని చెప్పారు. మహమ్మారి సంక్షోభం నుంచి త్వరలోనే బయటపడతామన్నారు. లాక్ డౌన్ తో మ్యూజియాలు, బార్లు, రెస్టారెంట్లు సహా అన్నింటినీ మూసేయనున్నారు.
France
Paris
Emmanuel Macron
Lockdown
COVID19

More Telugu News