Chandrababu: చంద్రబాబు నేతృత్వంలో పొలిట్ బ్యూరో కీల‌క‌ స‌మావేశం

chandrababu conducts polit bureau meet

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల్లో పోటీపై చ‌ర్చ‌
  • కాసేప‌ట్లో ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం
  • ఇప్ప‌టికే ఎస్ఈసీ స‌మావేశానికి దూరం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన‌ సమావేశానికి హాజ‌రుకాకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న టీడీపీ త‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది. నిన్న ప్ర‌క‌టించిన   ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఇందులో చర్చిస్తున్నారు. ఎన్నిక‌ల్లో పాల్గొనాలా? వ‌ద్దా? అనే అంశంపై నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి పొలిట్ బ్యూరో స‌మావేశం కొన‌సాగుతోంది. పార్టీ నేత‌ల అభిప్రాయాల‌ను చంద్ర‌బాబు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. అయిన‌ప్ప‌టికీ పాత నోటిఫికేషన్ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేయటంతో టీడీపీ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News