Pavan Kalyan: పవన్ కోసం హరీశ్ పక్కా మాస్ కథనే రెడీ చేశాడట!

Harish Shankar is doing a movie with pavan kalyan
  • 'గబ్బర్ సింగ్'తో హిట్ కాంబినేషన్
  • పవన్ తో మరో సినిమాకి రంగం సిద్ధం
  • జూన్ ఫస్టువీక్ లో పూజా కార్యక్రమాలు    
టాలీవుడ్లో వీవీ వినాయక్ తరువాత మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడమనేది ఆయన టైటిల్ దగ్గర నుంచే మొదలుపెడతాడు. మాస్ ఆడియన్స్ కి నచ్చాలంటే ఒక కథలో ఏయే అంశాలు ఎక్కడెక్కడ .. ఏయే పాళ్లలో కలపాలనేది ఆయనకి బాగా తెలుసు. 'గబ్బర్ సింగ్' .. 'దువ్వాడ జగన్నాథం' .. 'గద్దలకొండ గణేశ్' వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. వరుసగా మెగా హీరోలతోనే హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకున్న హరీశ్ శంకర్, పవన్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.


'గబ్బర్ సింగ్' సినిమా నుంచి పవన్ పట్ల  విపరీతమైన అభిమానాన్ని చూపుతూ వస్తున్న హరీశ్ శంకర్, ఆయనతో మరో సినిమా చేయాలనే ఆసక్తిని ఎప్పటి నుంచో కనబరుస్తూ వస్తున్నాడు. పవన్ రాజకీయాలలోకి వెళ్లడం వలన ఆలస్యమైంది. పవన్ రీ ఎంట్రీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన హరీశ్ శంకర్, ఇటీవల ఆయనకి ఒక పక్కా మాస్ కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడు.

ఇక, జూన్ మొదటివారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ ముందుగా ఒప్పుకున్న 'హరిహర వీరమల్లు' .. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ పూర్తయిన తరువాతనే హరీశ్ శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.
Pavan Kalyan
Harish Shankar
Mass Action Movie

More Telugu News