lemon: వేసవిలో తగ్గిన దిగుబడి.. పెరిగిన నిమ్మకాయ ధర!
- ఆదిలాబాద్‌లో గతంలో ఒక్క నిమ్మకాయ రూ.2
- ఇప్పుడు రూ.5కు ఒకటి
- వచ్చేనెల రూ.10కి చేరే అవకాశం
వేసవిలో ఠారెత్తిస్తున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మరసం తాగుతాం. వేసవిలో వాటి వాడకం సాధారణంగా పెరిగిపోతుంది. అయితే, ప్రస్తుతం వాటి దిగుమతి పడిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ మార్కెట్‌లో గతంలో ఒక నిమ్మకాయ రూ.2కే అమ్మేవారు.
ఇప్పుడు రూ.5కు ఒక నిమ్మకాయ చొప్పున అమ్ముతున్నారు. ఆ ధరకే కొందామని వచ్చినప్పటికీ చాలా మందికి నిమ్మకాయలు దొరకట్లేదు. అతి తక్కువగా మార్కెట్‌కు నిమ్మకాయలు వస్తుండడంతో డిమాండును బట్టి దొరకడం లేదు. ఆదిలాబాద్‌లో నిమ్మకాయలు తక్కువగా సాగు అవుతాయి.
దీంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.5గా ఉంటే, వచ్చేనెల ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ సమయానికి డిమాండ్ విపరీతంగా ఉంటుందని, రూ.10కి పెరిగే అవకాశాలూ లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు.