Narendra Modi: మిఠాయి దుకాణంలో మోదీ, దీదీ... ఎన్నికల వేళ వినూత్న రీతిలో వ్యాపారం

Modi and Mamata idols made off sweets in a Howrah sweet shop

  • పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు
  • వాడీవేడిగా ప్రచారం
  • స్వీట్స్ తో మోదీ, మమత విగ్రహాలు
  • ప్రజలను ఓటు వేసేలా ప్రోత్సహిస్తామన్న దుకాణదారు

పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా 6 విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌరాలోని ఓ స్వీట్ షాపులో ఆసక్తికర దృశ్యం కనిపించింది. మోదీ, మమతల విగ్రహాలతో పాటు సంజక్తా మోర్చా నేతల తలలతో కూడిన మరో విగ్రహం ఆ మిఠాయి దుకాణంలో దర్శనమిచ్చాయి. ఆ విగ్రహాలను మిఠాయి పదార్థాలతో చేయడం విశేషం.

దీనిపై ఆ దుకాణదారు స్పందిస్తూ, ఆర్నెల్ల వరకు ఈ మిఠాయిలు చెడిపోవని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తమ స్వీట్ విగ్రహాలు ప్రోత్సహిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా ఈ తియ్యని విగ్రహాలు ఆ మిఠాయి దుకాణానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాగా మమత బొమ్మను మాత్రం వీల్ చెయిర్ లో ఉన్నట్టుగానే తయారు చేశారు.

  • Loading...

More Telugu News