drunken drive: హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 1,917 మందిపై కేసులు.. ఒక్క నెలలో రూ.1,99,56,300 ఫైన్ వసూలు
- నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోయిన మందుబాబులు
- 58 మందికి జైలు శిక్ష
- రెండు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు శిక్ష
మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ మందుబాబులు వినిపించుకోవట్లేదు. గత నెలలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. అదే సమయంలో భారీగా జరిమానాలను వసూలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,917 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
వారిలో కోర్టు 58 మందికి రెండు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగతా 1,859 మంది నుంచి రూ.1,99,56,300 జరిమానాను వసూలు చేశారు. మోతాదుకి మించి మద్యం తాగడం, పదే పదే నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురికి తొమ్మి రోజుల జైలు శిక్ష పడింది. పది మందికి ఏడు రోజులు, 25 మందికి ఐదు రోజులు, 20 మందికి రెండు రోజుల జైలు శిక్షను విధించారు.