COVID19: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. టెస్టుల్లో రికార్డ్​

India reports 96982 new COVID19 cases

  • కొత్తగా 96,982 మందికి మహమ్మారి
  • మహమ్మారికి మరో 446 మంది బలి
  • టెస్టుల్లో 25 కోట్ల మైలు రాయిని దాటిన సర్కార్
  • మొత్తంగా 8.31 కోట్ల మందికి వ్యాక్సిన్

దేశంలో కరోనా వీర విహారం చేస్తోంది. గత 24 గంటల్లో 96,982 మంది మహమ్మారి బారిన పడ్డారు.  మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిన్న మరో 446 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 26 లక్షల 86 వేల 49కి పెరగ్గా.. లక్షా 65 వేల 547 మంది మహమ్మారి కారణంగా మరణించారు.

ఇక, దేశంలో ఇంకా 7 లక్షల 88 వేల 223 మంది కరోనాతో చికిత్స తీసుకుంటుండగా.. కోటీ 17 లక్షల 32 వేల 279 మంది కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా ఇప్పటిదాకా 8 కోట్ల 31 లక్షల 10 వేల 926 మంది కరోనా టీకా వేయించుకున్నారు. సోమవారం ఒక్కరోజే 43 లక్షల 966 మందికి వ్యాక్సిన్ వేశారు.

ఇక, కరోనా టెస్టుల్లో కేంద్రం ఓ మైలు రాయిని అధిగమించింది. ఇప్పటిదాకా 25 కోట్ల టెస్టులు చేసింది. నిన్న ఒక్కరోజే 12 లక్షల 11 వేల 612 టెస్టులు చేస్తే.. మొత్తంగా ఇప్పటిదాకా 25 కోట్ల 2 లక్షల 31 వేల 269 టెస్టులు చేశారు.

  • Loading...

More Telugu News