Assembly Elections: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Assembly polling continues in four states and one union territory
  • తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడత పోలింగ్
  • పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్
  • అసోంలో తుది దశ పోలింగ్
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమిళనాడులో 39.61 శాతం ఓటింగ్
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నేడు ఒకే విడతలో పోలింగ్ ముగియనుండగా, పశ్చిమ బెంగాల్ లో మూడో విడత, అసోంలో తుది దశ పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.61 శాతం పోలింగ్ నమోదు కాగా, పుదుచ్చేరిలో 53.76 శాతం నమోదైంది. అటు కేరళలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50.01 శాతం పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ లో 53.89, అసోంలో 53.23 శాతం ఓటింగ్ నమోదైంది.
Assembly Elections
Polling
Tamilnadu
Kerala
Puducherry
West Bengal
Assam

More Telugu News