Raghu Rama Krishna Raju: సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు అంటూ వార్తలు... అసలు విషయం చెప్పిన ఎంపీ

CBI court returns MP Raghurama Krishna Raju petition
  • జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు
  • సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు
  • పిటిషన్ తిరస్కరణకు గురైదంటూ వార్తలు 
  • సరైన పత్రాలు సమర్పించలేదని వ్యాఖ్యలు
ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ పై బయటున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని, రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై రఘురామకృష్ణరాజు అసలు విషయం చెప్పారు. సరైన పత్రాలు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసిందని, అంతేతప్ప తన పిటిషన్ ను తిరస్కరించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. కోర్టు కోరిన పత్రాలను శుక్రవారం దాఖలు చేస్తామని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Petition
Return
CBI Court
Jagan
Bail
YSRCP
Andhra Pradesh

More Telugu News