Parishat Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

All set for Parishat elections in AP
  • రాష్ట్రంలో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • 6,314 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
  • 247 నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు
  • 3,538 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్
ఏపీలో రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 6,314 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. రాష్ట్రంలో 247 నక్సల్స్ ప్రభావిత  పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 3,538 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.

ఇక మొత్తం 1,34,430 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 652 మంది ఆర్వోలు, 6,524 మంది మైక్రో అబ్జర్వర్లు, ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జి అధికారిని నియమించారు. 

కరోనా రోగులు సైతం ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కరోనా పాజిటివ్ ఓటర్ల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

అటు, పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అందుకోసం భారీగా పోలీసులను మోహరించారు.
Parishat Elections
Andhra Pradesh
Poling Stations

More Telugu News