Terrorists: కశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... ముగ్గురు టెర్రరిస్టుల హతం

Three terrorists killed in Shopian encounter
  • షోపియాన్ పట్టణంలో కాల్పులు
  • ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు
  • ఇంటిని చుట్టుముట్టిన భద్రతా బలగాలు
  • మృతుల్లో ఒకరు అగ్రశ్రేణి ఉగ్రవాద కమాండర్
జమ్మూ కశ్మీర్ లో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య భీకరస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. షోపియాన్ పట్టణంలోని జాన్ మొహల్లా ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఓ ఇంటిలో మిలిటెంట్లు నక్కారన్న సమాచారంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దాంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు.

మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు అల్ ఖైదా ప్రభావిత ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాత్ ఉల్ హింద్ (ఏజీహెచ్) అగ్రశ్రేణి కమాండర్ గా గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో చేతులు కలిపిన ఏజీహెచ్ జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరికొందరు మిలిటెంట్లు ఉన్నారని భావిస్తుండడంతో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్ పోలీసు విభాగం వెల్లడించింది.
Terrorists
Shopian
Jammu And Kashmir
India
Pakistan

More Telugu News