Chandrababu: దళితులను అవమానించేలా పోస్ట్ పెట్టిన చంద్రబాబు, లోకేశ్ లను వెంటనే అరెస్ట్ చేయండి... డీజీపీని కోరిన వైసీపీ నేతలు

YCP leaders asks DGP to arrest Chandrababu and Lokesh
  • తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
  • గురుమూర్తిని అవమానించేలా పోస్టు పెట్టారన్న వైసీపీ నేతలు
  • చంద్రబాబు, లోకేశ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
  • డీజీపిని కలిసిన నందిగం సురేశ్, మేరుగ, కైలే అనిల్ కుమార్
టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ దళితులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైసీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కులాన్ని, వృత్తిని అవమానించేలా ఆ పోస్టు ఉందని, దీన్ని దళిత జాతి మొత్తం వ్యతిరేకిస్తోందని తెలిపారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, మేరుగ నాగార్జున నేడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు డాక్టర్ గురుమూర్తి మసాజ్ చేస్తున్నట్టు టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారని, ఆ పోస్టును వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేశ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
Chandrababu
Nara Lokesh
YCP
DGP
Dr Gurumurthy

More Telugu News