Adivi Sesh: 'మేజర్' నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్టులుక్

Sobhitha Dulipalla First look From Major Movie
  • అడివి శేష్ నుంచి మరో మూవీ
  • ఈ నెల 12వ తేదీన టీజర్ రిలీజ్
  • జూలై 2వ తేదీన సినిమా విడుదల  
అడివి శేష్ మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందువలన ఆయనకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటన కూడా చాలా సింపుల్ గా .. నేచురల్ గా ఉంటుంది.తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఆయన చేసుకుంటూ వెళుతున్నాడు.

 అలా ఆయన తాజా చిత్రంగా 'మేజర్' సినిమా రూపొందుతోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ - శోభిత ధూళిపాళ్ల ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో పోస్టర్ ను వదులుతూ అంచనాలు పెంచుతున్నారు.

తాజాగా 'మేజర్' సినిమా నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె ఎన్నారై పాత్రలో కనిపించనుంది. శోభిత ఒక పాపను ఎత్తుకుని రక్షించే ప్రయత్నంలో ఉన్నట్టుగా భయంతో కనిపిస్తోంది. 'ఆమెకి ధైర్యం లేదు .. కానీ వేరే మార్గం లేదు' అంటూ వదిలిన ఈ పోస్టర్, సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచేస్తోంది. ఈ నెల 12వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్న విషయాన్ని  ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మహేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, జూలై 2వ తేదీన విడుదల చేయనున్నారు.
Adivi Sesh
Sobhith Dulipalla
Prakash Raj

More Telugu News