RSS: గత నెలలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరెస్సెస్ చీఫ్‌.. కరోనాతో ఆసుపత్రిలో చేరిక

RSS chief Mohan Bhagwat tests corona  positive
  • గత నెల 7న భయ్యాజీ జోషితో కలిసి తొలి డోస్ తీసుకున్న భగవత్
  • లక్షణాలు కనిపించడంతో పరీక్షలు
  • పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కింగ్స్‌వే ఆసుపత్రిలో చేరిక
గత నెల ఏడో తేదీన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆరెస్సెస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆయనలో స్వల్పంగా లక్షణాలు బయటపడడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆయన వెంటనే నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. కాగా, మార్చి 7న మోహన్ భగవత్ ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషితో కలిసి నాగ్‌పూర్‌లోని నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
RSS
Mohan Bhagwa
Corona Virus

More Telugu News