Delhi Capitals: ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ
- ముంబయి వాంఖెడే స్టేడియంలో చెన్నై వర్సెస్ ఢిల్లీ
- గురుశిష్యుల సమరంగా ప్రచారం
- చెన్నై జట్టుకు ధోనీ, ఢిల్లీకి పంత్ సారథ్యం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్
ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఛేదనకు మొగ్గు చూపాడు.
ఓ రకంగా ఇది గురుశిష్యుల సమరం అని చెప్పవచ్చు. చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీకి పంత్ సారథి. ధోనీ సీనియర్ వికెట్ కీపర్ కాగా, ధోనీ వారసుడిగా పంత్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడీ ఇద్దరు పరస్పరం తలపడుతుండడంతో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భుజం గాయానికి గురవడంతో అతడి స్థానంలో పంత్ కెప్టెన్సీ చేపడుతుండడం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, జడేజా, శామ్ కరన్ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్ కీలకం. ఇక ఢిల్లీ జట్టులోనూ ప్రతిభకు కొదవలేదు. ధావన్, పృథ్వీ షా, రహానే, పంత్, స్టొయినిస్, హెట్మెయర్ లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ లో అశ్విన్ తురుపుముక్క కానున్నాడు.