EC: పశ్చిమ బెంగాల్ లో సీఐఎస్ఎఫ్ కాల్పులను సమర్థించిన ఈసీ
- పశ్చిమ బెంగాల్ లో నేడు నాలుగో విడత ఎన్నికలు
- పెచ్చరిల్లిన హింస.. పోలింగ్ రక్తసిక్తం
- సితల్ కుచి వద్ద సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పులు
- కాల్పులలో నలుగురి మృతి
- విధిలేని పరిస్థితుల్లోనే కాల్చారన్న ఈసీ
పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ రక్తసిక్తమైన సంగతి తెలిసిందే. బెంగాల్ లోని సితల్ కుచి లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద హింసాత్మక పరిస్థితి చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
అయితే ఎన్నికల సంఘం సీఐఎస్ఎఫ్ కాల్పులను సమర్ధించింది. మరో మార్గం లేని పరిస్థితుల్లోనే సీఐఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారని పేర్కొంది. జవాన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు సమూహం యత్నించిందని... దాంతో ఓటర్లు, పోలింగ్ సిబ్బంది ప్రాణాలు కాపాడేందుకే జవాన్లు కాల్పులు జరిపారని ఈసీ స్పష్టం చేసింది.