Kolkata Night Riders: సన్ రైజర్స్ పై గెలుపుతో ఐపీఎల్ లో 100వ విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్!

KKR wins on SRH

  • నిన్న రాత్రి చెన్నై వేదికగా మ్యాచ్
  • 199 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయిన సన్ రైజర్స్
  • సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్ లోనే ఓటమి

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో, ఆపై బౌలింగ్ లోనూ రాణించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ముందంజ వేయడంతో పాటు ఐపీఎల్ పోటీల్లో 100వ విజయాన్ని సొంతం చేసుకుంది.

 టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్ నిశిత్ రానా 80 పరుగులు, రాహుల్ త్రిపాఠి 53 పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఆ జట్టు 187 పరుగులు సాధించింది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసినా, అతనికి మిగతా బౌలర్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు.

ఆపై 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 3 పరుగులకు, వృద్ధిమాన్ సాహా 7 పరుగులకు అవుట్ కావడంతో సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. ఆపై జానీ బెయిర్ స్టో అద్భుత రీతిలో ఆడుతూ, హాఫ్ సెంచరీ సాధించినా, విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. మనీష్ పాండే 61  (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టిన రానా, వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు.

ఆ తరువాత వరుసగా వికెట్లు పడుతూ ఉండటంతో రన్ రేట్ పెరిగిపోయి, మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. చివర్లో యువ ఆటగాడు అబ్దుల్ సమద్ చెలరేగినా, 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో తమ తొలి ఓటమిని మూటగట్టుకుంది.

  • Loading...

More Telugu News