Corona Virus: తెలంగాణలో మాస్కులు పెట్టుకోని 6,500 మందికి జరిమానా.. కేసులు
- మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అత్యధికంగా జరిమానా
- ఆయా ప్రాంతాల్లో మొత్తం 3,500 మందిపై కేసులు
తెలంగాణలో కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఎవరైనా మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారు 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వారిలో అత్యధిక మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కలిపి మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మాస్కు పెట్టుకోని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద జరిమానా విధించడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.