rakesh tikayat: మాతో కేంద్ర స‌ర్కారు మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌ర‌పాలి: రాకేశ్ తికాయ‌త్

we are ready to discuss rakesh

  • జనవరి 22న ఆ చ‌ర్చ‌లు ముగిశాయి
  • తిరిగి అక్కడి నుంచే మళ్లీ  ప్రారంభం కావాలి
  • కొత్త వ్య‌వ‌సాయ‌ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చట్టాలకు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కావాలని చెప్పారు.

ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులను కేంద్ర స‌ర్కారు చర్చలకు ఆహ్వానించాలని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల్లో పాల్గొన్నామ‌ని, ఈ ఏడాది జనవరి 22న ఆ చ‌ర్చ‌లు ఎక్కడైతే ముగిశాయో.. తిరిగి అక్కడి నుంచే మళ్లీ  ప్రారంభం కావాలని ఆయ‌న చెప్పారు. కేంద్ర స‌ర్కారు తీసుకొచ్చిన‌ మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలనేదే త‌మ‌ డిమాండ్ అని, త‌మ డిమాండ్లు యథాతథంగా ఉంటాయని స్ప‌ష్టం చేశారు.

అలాగే, రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాకేశ్‌ తికాయత్ అన్నారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌లో స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని చెబుతుండ‌గా, వాటిని పూర్తిగా ర‌ద్దు చేయాల్సిందేన‌ని రైతులు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో చ‌ర్చ‌లు ఫ‌లించ‌ట్లేదు.

  • Loading...

More Telugu News