Corona Virus: క‌రోనా నుంచి కోలుకున్నాక దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

side eeffect of corona

  • తేల్చి చెప్పిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ
  • నాడీ సమస్యలు అధికం
  • మాన‌సిక‌ సమస్యలు ఎదుర్కొంటోన్న వైనం

మాన‌వాళిని ముప్పుతిప్ప‌లు పెడుతోన్న క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌ ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు. క‌రోనా సోకి ఎలాగోలా కోలుకున్న‌ప్ప‌టికీ వైర‌స్ ప్ర‌భావంతో చాలా మందికి ఇత‌ర స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. దీనిపై ప‌రిశోధ‌న‌లు చేసిన
 ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప‌లు కొత్త విష‌యాల‌ను గుర్తించింది.

కరోనా సోకి కోలుకున్న‌ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతున్నార‌ని తేల్చింది. క‌రోసా సోకిన‌ ఆరు నెలల్లోనే ఏకంగా సుమారు 34 శాతం మందిపై ఆ ప్ర‌భావం క‌న‌ప‌డింది. క‌రోనా నుంచి కోలుకున్న 17 శాతం మందిలో ఆందోళన, 14 శాతం మందిలో మూడ్‌ మారిపోయే సమస్యలు ఎదుర‌వుతున్నాయి.

13 శాతం మంది మొట్టమొదటిసారి మానసిక సమస్యల‌ను ఎదుర్కొంటున్నారు. అలాగే, మెదడులో రక్తస్రావం 0.6 శాతం, పక్షవాతం 2.1 శాతం, మతిమరుపు 0.7 శాతం మందిలో క‌న‌ప‌డుతున్నాయి. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉండి కోలుకున్న వారిలో నాడీ సమస్యల వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు ప్రధానంగా క‌న‌ప‌డుతున్నాయి.

ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కన్నా క‌రోనా చాలా ప్రమాదకరమ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఫ్లూతో పోల్చి చూస్తే కరోనా ప్ర‌భావం వ‌ల్ల నాడి, మానసిక సమస్యల ముప్పు 44 శాతం అధికంగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. శ్వాసకోశ జబ్బులతో పోలిస్తే క‌రోనా వ‌ల్ల ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం ముప్పు 16 శాతం అధికంగా ఉంద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News