Tihar Jail: రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే.. పారిపోయిన ఖైదీలు!

Released on parole last year to decongest Tihar jail more than 3000 inmates missing

  • తిహార్ జైలులో ఘటన
  • జాడ లేకుండా పోయిన 3,400 మంది ఖైదీలు
  • ఢిల్లీ పోలీసుల సాయం కోరిన జైలు అధికారులు
  • కరోనా నేపథ్యంలో పెరోల్ ఇవ్వాలన్న కోర్టు
  • ఆదేశాలను పాటించిన తిహార్ జైలు
  • ఆ తర్వాత జైలుకు తిరిగిరాని ఖైదీలు

కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ఆలోచించి.. ఖైదీలకు అత్యవసర పెరోల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించి 6,740 మంది దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను తిహార్ జైలు అధికారులు పెరోల్ మీద విడుదల చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత దాదాపు 3,400 మందికిపైగా ఖైదీలు తిరిగి జైలు ముఖం చూడలేదు. తప్పించుకుపారిపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులను తిహార్ జైలు అధికారులు సంప్రదించారు.

పెరోల్ లో భాగంగా 1,184 మంది దోషులుగా తేలిన ఖైదీలను విడిచిపెట్టగా.. 1,072 మంది తిరిగి జైలుకు వచ్చేశారు. 112 మంది తప్పించుకుపారిపోయారు. ఇటు 5,556 మంది విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలనూ పెరోల్ మీద జైలు అధికారులు విడుదల చేశారు. అందులో 2,200 మంది దాకా వచ్చినా.. మిగతా 3,300 మంది జాడ లేకుండా పోయారు.

దీంతో వారి వివరాలన్నింటినీ ఢిల్లీ పోలీసులకు ఇచ్చి.. వారిని పట్టివ్వాలని కోరింది. అయితే, విచారణ ఖైదీల్లో కొందరు సరెండర్ అవుతామంటున్నారని, మిగతా వారు మాత్రం బెయిల్ తీసుకున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు. కాగా, విడుదల చేసిన ఖైదీల్లో చాలా మందికి ఎయిడ్స్, కేన్సర్, మూత్రపిండాల జబ్బులు, ఆయాసం, క్షయ వంటి వ్యాధులున్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News