Maruthi: అందాలరాశి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసిన మారుతి!

Rashi khanna is doing in Maruthi film
  • గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్'
  • మారుతి డైరెక్షన్లో మరోసారి రాశి ఖన్నా
  • అభిమానుల్లో ఆమె పాత్ర పట్ల ఆసక్తి  
తెలుగు తెరపై తెల్లగులాబీలా రాశి ఖన్నా కనిపిస్తుంది. అమాయకత్వంతో కూడిన అందం రాశిఖన్నా ప్రత్యేకత. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆమె ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతోంది. అందువలన ఆమె కెరియర్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోయినట్టుగా ఎక్కడా కనిపించదు. కానీ ఇచ్చిన పాత్రకు గ్లామర్ ను .. నటనను కలిపి ముట్టజెబుతుంది. అలాంటి ఈ పిల్లతో 'సుప్రీమ్' సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ చేయించాడు. ఆ సినిమాలో బెల్లం శ్రీదేవిగా ఆమె కుర్రాళ్ల గుండె కోటలను కూలగొట్టేసింది.

ఆ తరువాత లాక్ డౌన్ కి ముందు వచ్చిన 'ప్రతి రోజూ పండగే' సినిమాలో ఆమెతో దర్శకుడు మారుతి కామెడీని చేయించాడు. ఈ సినిమాలో రాశిఖన్నా పోషించిన టిక్ టాక్ స్టార్ ఎంజిల్ ఆర్నా పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సారి కూడా మారుతి ఆమె పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ కామెడీ టచ్ ఇచ్చాడట. గోపీచంద్ హీరోగా ఆయన 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెరపై తాను కనిపిస్తున్నంత సేపు రాశి ఖన్నా నవ్విస్తూనే ఉంటుందట. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరును తీసుకురావడం ఖాయమని అంటున్నారు.
Maruthi
Gopichand
Rashi Khanna

More Telugu News