COVID19: విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: అధ్యయనంలో వెల్లడి

Leaving the middle seat on planes reduces the covid threat

  • మధ్యసీటును వదిలేయడం ద్వారా ముప్పును 57 శాతం తగ్గించొచ్చు
  • కిటికీలు, ద్వారాలు మూసి ఉంచడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది
  • అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి

విమాన ప్రయాణాల సమయంలో మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. విమాన ప్రయాణ సమయంలో ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటివి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ), కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడు సీట్లున్న విమానాల మోడల్‌ను రూపొందించి అధ్యయనం చేపట్టారు.

విమానాల సామర్థ్యం పూర్తిగా ఉన్నప్పుడు, మధ్యలోని సీటును ఖాళీగా వదిలేసినప్పుడు వైరస్ వ్యాప్తిని అంచనా వేశారు. మూడు సీట్లలోనూ ప్రయాణికులు కూర్చున్నప్పటితో పోలిస్తే మధ్య సీటును వదిలేసి ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తిని 23 శాతం నుంచి 57 శాతం వరకు తగ్గించొచ్చని గుర్తించారు. సీట్ల మధ్య ఖాళీని వదలడంతోపాటు మాస్క్, ఫేస్ షీల్డ్ వంటివి ధరించడం వల్ల కూడా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News