students: 100 మార్కులకు 125 వరకు మార్కులు వేసిన వైనం!

students get 125 marks out of 100

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ లో ఘ‌ట‌న‌
  • ఛత్రపతి షాహ్జీ మహరాజ్ విశ్వవిద్యాయంలో అవ‌క‌త‌వ‌క‌లు
  • బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల‌కు 100 మార్కుల‌కు ప‌రీక్ష‌లు
  • కొంద‌రు విద్యార్థుల‌కు 116 నుంచి 126 మ‌ధ్య‌ మార్కులు

ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు ఫ‌లితాల కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తుంటారు. ఏ స‌బ్జెక్టులోనైనా 100కు 100 మార్కులు వ‌స్తే ఎగిరి గంతులు వేస్తారు. అయితే, 100 మార్కుల పశ్న పత్రానికి 125 మార్కులు వ‌స్తే ఏం చేయాలి? అలా ఎలా వ‌స్తాయని అనుకుంటున్నారా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని  కాన్పూర్ లో ఇదే జ‌రిగింది.

ఛత్రపతి షాహ్జీ మహరాజ్ విశ్వవిద్యాయం బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల‌కు 100 మార్కుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే అంతకు మించి మార్కులు వ‌చ్చాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మూడవ సంవత్సరం ఫలితాలలో మెటీరియల్ అండ్ మెథడ్ సబ్జెక్టులో త‌మ‌కు వ‌చ్చిన మార్కులు చూసుకున్న విద్యార్థులకు దానిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు.

కావాల‌నే కొంద‌రు ఇలా 100కు అంత‌కంటే ఎక్కువ మార్కులు వేశార‌ని విద్యార్థులు అంటున్నారు. దీనిపై ఆ విశ్వ‌విద్యాల‌యం విచార‌ణ ప్రారంభించింది. అధ్యాపకులు ప‌రీక్ష‌ పత్రాలను దిద్దేటప్పుడు ఈ పొర‌పాటు జ‌రిగిందా? లేక ఫ‌లితాల విడుద‌లలో సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ ఘ‌ట‌న చోటు చేసుకుందా? అనే అంశంపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

చాలా మంది విద్యార్థులకు 100కు 116 నుంచి 126 మార్కుల వరకూ మార్కులు వ‌చ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. అలాగే, ఫొటోగ్రఫీ సబ్జెక్టు ప‌రీక్ష‌ను 75 మార్కులకు నిర్వ‌హిస్తూ కొంద‌రు విద్యార్థులకు 79 వ‌ర‌కు మార్కులు వచ్చాయి.

  • Loading...

More Telugu News