Vivek: వివేక్ నటుడే కాదు సామాజిక స్పృహ నిండిన బాధ్యత గల పౌరుడు: విజయశాంతి

Vijayasanthi condolences to the demise of Kollywood actor Vivek
  • తమిళ నటుడు వివేక్ అకాల మరణం
  • ఆసుపత్రిలో ఈ ఉదయం కన్నుమూత
  • షాక్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమ
  • తీవ్ర విషాదంలో సినీ ప్రముఖులు, అభిమానులు
తమిళ హాస్యనటుడు వివేక్ అనూహ్య మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర విషాదానికి లోనైన చిత్ర ప్రముఖులు, అభిమానులు వివేక్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రముఖ సినీ నటి, తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి కూడా వివేక్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివేక్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన అకాల మరణం తనను ఆవేదనకు గురిచేసిందని అన్నారు. వివేక్ నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ నిండిన ఒక బాధ్యత గల పౌరుడు అని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన మంచి వ్యక్తి అని కీర్తించారు.

అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సామాజిక ప్రచార కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారని విజయశాంతి తెలిపారు. వివేక్ ఆత్మకు శాంతి కలగాలని ఆ పరమాత్మను వేడుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు వివరించారు. గుండెపోటుకు గురైన వివేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
Vivek
Demise
Vijayashanti
Condolences
Kollywood
Chennai
Tamilnadu

More Telugu News