NASA: అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి చేరిన ఇద్దరు కాస్మొనాట్స్, ఒక ఆస్ట్రోనాట్... నాసా వీడియో!
- గత అర్ధరాత్రి ఖజకిస్థాన్ లో ల్యాండింగ్
- ఐఎస్ఎస్ లోకి 64వ ప్రయాణం విజయవంతం
- వీడియో విడుదల చేసిన నాసా
దాదాపు ఆరు నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో గడిపిన ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్, ఓ నాసా ఆస్ట్రొనాట్ క్షేమంగా భూమికి దిగారు. శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో వీరు భూమిని చేరారని నాసా ప్రకటించింది. గత సంవత్సరం అక్టోబర్ 14న వీరు స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన సూయజ్ ఎంఎస్-17లో వెళ్లారు. ఐఎస్ఎస్ లోకి భూమిపై నుంచి వెళ్లిన 64వ ప్రయాణం ఇది.
వీరి ఆరునెలల పర్యటనలో భూమిపై చుట్టూ 2,960 సార్లు పరిభ్రమించారు. ఆపై దాదాపు మూడున్నర గంటల ప్రయాణం తరువాత వీరు ఖజకిస్థాన్ లోని డెకాజన్ నగర శివార్లలో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది. కాస్మొనాట్స్, ఆస్ట్రొనాట్ భూమిని చేరగానే, రష్యన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ లు వారిని చేరుకుని తదుపరి సహాయక చర్యలను ప్రారంభించారు.
స్పేస్ క్రాఫ్ట్ నుంచి రష్యాకు చెందిన సెర్జి రిజికోవ్ బయటకు రాగా, ఆపై ఫ్లయిట్ ఇంజనీర్లు కేట్ రూబిన్స్, కుడ్ సెవర్చ్ కోవ్ లు బయటకు వచ్చారు. ఆపై వీరికి మెడికల్ పరీక్షలు చేసి, ఆసుపత్రులకు తరలించారు. వీరు ముగ్గురూ తమ బంధుమిత్రులు, స్నేహితులతో మాట్లాడారని నాసా వర్గాలు వెల్లడించాయి.