Andhra Pradesh: పర్యావరణ ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి 17వ ర్యాంకు
- 0.510 మార్కులతో 17వ ర్యాంకు
- ఏపీకి ప్రతికూలంగా మారిన పలు అంశాలు
- పర్యావరణ ముప్పు ఎక్కువగా ఉన్నా జిల్లాల్లో మూడు ఏపీలోనే
పర్యావరణ ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల సూచీలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. పర్యావరణ ముప్పు సూచీలో 0.510 మార్కులతో రాష్ట్రం 17వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు కేంద్రం నిన్న పర్యావరణ ముప్పు సూచీ నివేదికను విడుదల చేసింది.
అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడం, నీటి ద్వారా సోకే జబ్బులు అధికంగా ఉండడం వంటి అంశాలు రాష్ట్రానికి ప్రతికూలంగా మారాయి. అంతేకాదు, దేశంలో పర్యావరణ ముప్పునకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న 25 శాతం జిల్లాల జాబితాలో రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాలు ఉన్నాయి. అలాగే, ఆరు జిల్లాలు మధ్యస్థ ప్రమాదం పొంచి ఉన్న, 3 జిల్లాలు తక్కువ ముప్పున్న జిల్లాల్లో, ఒక జిల్లా అతి తక్కువ ప్రమాదం ఉన్న జిల్లాల జాబితాలో నిలిచాయి.