Sharmila: దీక్ష విర‌మించిన ష‌ర్మిల‌... కేసీఆర్‌పై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు

sharmila slams kcr

  • నిరుద్యోగుల‌ క‌న్నీళ్ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు చూడాలి
  • నిరుద్యోగుల‌ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం  కేసీఆర్ కాదా?
  • కేసీఆర్ అసమ‌ర్థుడు
  • ఆయ‌న ఛాతీలో ఉన్నది గుండెనా? బ‌ండ రాయా?

వైఎస్ ష‌ర్మిల త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మొద‌ట హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద అనంత‌రం లోట‌స్‌పాండ్ వ‌ద్ద ష‌ర్మిల 72 గంట‌ల పాటు నిరాహార దీక్ష‌ను చేశారు. ఈ రోజు ఆమెతో నిరుద్యోగుల కుటుంబస‌భ్యులు దీక్ష‌ను విర‌మింప‌జేశారు.  

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పాల‌కుల్లో ఒక్క‌రికైనా గుండె ఉందా? ఆ ఛాతీలో ఉన్న‌ది గుండెనా? బ‌ండ రాయా? ఉద్యోగాల కోసం యువ‌త ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. వీరి క‌న్నీళ్ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు చూడాలి. నేను నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకోవాలి. 72 గంట‌లు నిరాహార దీక్ష చేశాను' అని ష‌ర్మిల తెలిపారు.

'నాకు మ‌ద్ద‌తు ప‌లికిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఈ రోజు తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నారు.. ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఎప్పుడు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వారికి వ‌య‌సు కూడా పెరిగిపోతోంది. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం సీఎం కేసీఆర్ కాదా? ఇవి హ‌త్యలా? ఆత్మ‌హ‌త్య‌లా?' ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు కురిపించారు.  

'కేసీఆర్ చిటికేస్తే నోటిఫికేష‌న్లు వ‌స్తాయి. అప్ప‌ట్లో వైఎస్సార్ మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చారు. ఉద్యోగాలను భ‌ర్తీ చేశారు.. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు. అప్ప‌ట్లో వైఎస్సార్ ప్రైవేటు రంగంలోనూ ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ మాత్రం అసమ‌ర్థుడు.. ఆయ‌న ఛాతీలో ఉన్నది గుండెనా? బ‌ండా?  దొర‌ల గ‌డీ నుంచి నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారు' అని ష‌ర్మిల విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.  

'ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేతుల‌కు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. అందుకే నేను పోరాటం చేస్తాన‌ని వ‌చ్చాను. కులాలు, మ‌తాలకు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించారు వైఎస్సార్‌. ఆ మ‌హానేత ముద్దుబిడ్డ‌ని నేను. నేను ఇప్పుడు పోరాటం చేస్తున్నాన‌ని పాల‌కుల‌కు భ‌యం వేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేశారు' అని ష‌ర్మిల తెలిపారు.

పోలీసులు కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా?


పోలీసుల‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పోలీసులు లా అండ్ ఆర్డ‌ర్ కోసం ప‌నిచేస్తున్నారా?  కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా?  తెలంగాణ త‌ల్లి సాక్షిగా మా బ‌ట్ట‌లు చింపి, నా చేతిని విర‌గొట్టి, ఇంకొక త‌మ్ముడి కాళ్లు విర‌గ్గొట్టి తీసుకెళ్లారు. సిగ్గుండాలి పాల‌కుల‌కు. ఆడ‌వాళ్ల మీదనా మీ ప్ర‌తాపం. యావ‌త్ మ‌హిళా లోకం ఈ పాల‌కుల మీద ఉమ్మి వేస్తోంది'

'నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌ట్లేదు. తెలంగాణ రాకముందు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని చెప్పారు. అవ‌న్నీ అస‌త్యాలేన‌ని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి' అని ష‌ర్మిల విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.  

రాజ‌న్న బిడ్డ‌గా చెబుతున్నాను..


త‌న పోరాటం ఆగ‌బోద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. '72 గంట‌ల నిరాహార దీక్షతో పోరాటం ఆగ‌దు. మాట మీద నిల‌బ‌డ్డ‌ రాజ‌న్న బిడ్డగా చెబుతున్నా.. నేను పోరాటాన్ని కొన‌సాగిస్తూ ఉంటాను. ల‌క్షా 91 వేల ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల్సిందే. దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారు స్పందించ‌కుండా ఇలాగే కాల‌యాప‌న చేస్తే మేము చేయ‌బోయే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో నిరుద్యోగుల అంశాన్ని లేవ‌నెత్తుతాం' అని ష‌ర్మిల తెలిపారు.


  • Loading...

More Telugu News