SBI: బ్యాంకుకు సంబంధించిన రహస్య సమాచారం ఫోన్‌లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్‌బీఐ హెచ్చరిక

SBI warns customers against online fraud

  • పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు
  • పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డిలీట్ చేయాలన్న ఎస్‌బీఐ
  • ఫోన్‌లో అవి ఉంటే మోసపోక తప్పదని హెచ్చరిక

ఆన్‌లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుండడంతో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు హెచ్చరికలు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా సెల్‌ఫోన్లలో దాచుకుంటే వెంటనే దానిని డిలీట్ చేయాలని సూచించింది. ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్ సహా కీలక విషయాలు ఏవీ ఫోన్‌లో ఉండకుండా చూసుకోవాలని కోరింది. అవి కనుక ఫోన్‌లో ఉంటే మోసాల బారినపడడం ఖాయమని, కాబట్టి అలాంటి సమాచారమేదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలని స్టేట్‌బ్యాంకు సూచించింది.

  • Loading...

More Telugu News