Chhattisgarh: దంతేవాడలో ఎదురుకాల్పులు.. రూ.5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు హతం
- మావోయిస్టు మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తింపు
- 9 ఎంఎం తుపాకీతో పాటు మూడు కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం
- ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అతడు మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించారు. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి 9 ఎంఎం తుపాకీతో పాటు మూడు కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుని పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భద్రతా బలగాలు దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి.