Pawan Kalyan: లక్షలాది విద్యార్థులను, వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan kalyan slams ap govt

  • క‌రోనా ఉద్ధృతిలో పరీక్షల నిర్వహణ ఏపీ ప్రభుత్వ మూర్ఖత్వమే
  • ఇప్ప‌టికే సీబీఎస్ఈ కూడా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసింది
  • ఏపీలో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జ‌రుగుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమేనంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నిర్ణ‌యంతో లక్షలాది విద్యార్థులను మాత్ర‌మే కాకుండా వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీబీఎస్ఈ కూడా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసి ప్రమోట్ చేసిందని ఆయ‌న గుర్తు చేశారు. ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
  

  • Loading...

More Telugu News