Supreme Court: రేపటి నుంచి అత్యవసర కేసులనే విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం
- సుప్రీంకోర్టు విచారణలపై కరోనా ప్రభావం
- సాధారణ కేసుల విచారణలు వాయిదా
- వర్చువల్ విధానంలోనే విచారణ
- అది కూడా అత్యవసర కేసులకే పరిమితం
దేశంలో కరోనా విజృంభణ ప్రభావం సుప్రీంకోర్టులో కేసుల విచారణపైనా పడింది. గతంలోనూ కరోనా కారణంగా వర్చువల్ బాట పట్టిన అత్యున్నత న్యాయస్థానం మరోసారి అదే పంథాను అనుసరిస్తోంది. రేపటి నుంచి అత్యవసర కేసులనే విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అది కూడా వర్చువల్ విధానంలోనే విచారణ జరపనుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సాధారణ కేసుల విచారణ వాయిదా వేసింది. అత్యవసర కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈమెయిల్ ద్వారానే స్వీకరించనున్నారు.