Corona Virus: విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలగింపు?

Govt is planning to levy Import duty on Foreign Vaccines

  • ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ధరల్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం
  • ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకం

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో టీకాలకు డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. అయితే, దేశీయంగా అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలు ఇక్కడి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో విదేశాల నుంచి టీకాల్ని దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు విదేశీ టీకా సంస్థలు భారత్‌లో దరఖాస్తు చేసుకున్నాయి.

అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశీ టీకాలపై 10 శాతం దిగుమతి సుంకం  వర్తిస్తుంది. ఐజీఎస్టీ, సర్‌ ఛార్జీలు కలుపుకొని టీకా ఖరీదు భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీకాల్ని భారత్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు 10 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.

అలాగే ప్రైవేటు సంస్థలు టీకాల్ని విదేశాల నుంచి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీకాల కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News