Supreme Court: ఆక్సిజన్​ కొరతపై సుప్రీంకోర్టు సీరియస్​

trial in supreme court on corona

  • భార‌త్‌లో క‌రోనా ఉద్ధృతిపై సుప్రీంకోర్టు విచార‌ణ‌
  • ఆసుప‌త్రుల్లో రోగులకు ఆక్సిజన్ అందట్లేద‌న్న బోబ్డే
  • దీంతో ప్రాణాలు కోల్పోతున్నార‌ని వ్యాఖ్య‌
  • విచార‌ణ ఏప్రిల్ 27కు వాయిదా

దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చడంతో కొవిడ్‌ నియంత్ర‌ణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై వివ‌రాలు తెల‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి నిన్న‌ నోటీసులు జారీ చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ పంపిణీ వంటి అంశాల‌పై నేడు విచార‌ణ ప్రారంభించింది.

అయితే, సీనియర్ న్యాయవాది హరీశ్‌ సాల్వే అమికస్ క్యూరీగా తప్పుకున్నారు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతి నిచ్చింది. ఆసుప‌త్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నార‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అన్నారు. ఔష‌ధాలు, వ్యాక్సినేషన్ కు అనుసరిస్తున్న విధానంతో పాటు లాక్డౌన్ ఆంక్ష‌ల‌పై ఆయ‌న ఆరా తీశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు.  

  • Loading...

More Telugu News