Telangana: కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వ వివరణ పట్ల హైకోర్టు అసంతృప్తి!

Telangana high court asks state govt about covid management

  • దేశంలో కరోనా సెకండ్ వేవ్
  • ప్రమాదకర పరిస్థితుల్లో రాష్ట్రాలు!
  • ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్న తెలంగాణ హైకోర్టు
  • ఆర్టీపీసీఆర్ రిపోర్టుల నేపథ్యంలో కోర్టు అసంతృప్తి

కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. కొన్నిచోట్ల కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణ పట్ల హైకోర్టు అసహనం ప్రదర్శించింది. పగటివేళ బహిరంగ ప్రదేశాల్లోనూ, థియేటర్లు, బార్లు వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కుంభమేళా నుంచి వచ్చినవారిని పలు రాష్ట్రాలు క్వారంటైన్ లో ఉంచుతున్నాయని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ప్రశ్నించింది.

పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల వద్ద తీసుకుంటున్న చర్యలపై వివరించాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లో ఎందుకు ఇవ్వడంలేదు? వీఐపీల కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లోనే ఎలా వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తుంటే ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రించడంలేదని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విదేశాల నుంచి వచ్చేవారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎందుకు అడగడంలేదని నిలదీసింది.

  • Loading...

More Telugu News