Jawa Bike: ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి అదిరిపోయే కానుక!

Jawa bike for real hero railway employee Mayur Shelke

  • ఇటీవల ముంబయిలో ఘటన
  • రైలు పట్టాలపై జారిపడిన చిన్నారి
  • అటుగా వస్తున్న రైలు
  • పట్టాలపై పరుగులు తీసి చిన్నారిని కాపాడిన షెల్కే
  • జాతీయ స్థాయిలో రియల్ హీరోగా గుర్తింపు
  • ఇప్పటికే రూ.50 వేల నగదు అందించిన రైల్వేశాఖ

ఇటీవల ముంబయిలోని వాంగని రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై జాతీయస్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే శాఖలో పాయింట్స్ మన్ గా పనిచేస్తున్న మయూర్ షెల్కేను రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్వయంగా అభినందించడమే కాకుండా, రూ.50 వేల నగదు బహుమతి కూడా అందించారు.

తాజాగా, ఈ రియల్ హీరోకు మరో బంపర్ గిఫ్ట్ లభించింది. జావా మోటార్ సైకిల్స్ సంస్థ ఓ జావా బైక్ ను కానుకగా అందించింది. షెల్కే వీరోచిత చర్య తర్వాత జావా మోటార్ సైకిల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఓ బైక్ ఇస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే జావా 42 మోడల్ బైక్ ను అతడికి ప్రదానం చేశారు. జావా సిబ్బంది స్వయంగా షెల్కే నివాసానికి వెళ్లి మరీ బండిని అప్పగించడం విశేషం.

  • Loading...

More Telugu News