SA Bobde: పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే
- 2019లో సీజేఐగా వచ్చిన ఎస్ఏ బోబ్డే
- ఈ సాయంత్రం పదవీ విరమణ
- నూతన సీజేఐగా ఎన్వీ రమణ
- రమణ సమర్థుడన్న బోబ్డే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఈ సాయంత్రం పదవీవిరమణ చేశారు. బోబ్డే స్థానంలో తెలుగువాడైన జస్టిస్ ఎన్వీ రమణ రేపు నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. బోబ్డే 2019లో సీజేఐగా నియమితులయ్యారు. 1978లో ఆయన న్యాయవాద ప్రస్థానం ప్రారంభమైంది. తన కెరీర్ లో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2013లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ, ఎంతో సంతృప్తికరంగా తన పదవీకాలం సాగిందని, ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన వారసుడు, 48వ సీజేఐ ఎన్వీ రమణ సమర్థుడని కితాబునిచ్చారు.