Raaviteja: మరో యువ దర్శకుడితో రవితేజ ప్రాజక్ట్

Raviteja gave a green signal to new director
  • దూకుడు మీదున్న రవితేజ
  • వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
  • లైన్లో ఉన్న దర్శకుడిగా మారుతి పేరు  
రవితేజ ఈ ఏడాది మామూలు స్పీడ్ మీద లేడు .. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నాడు. ఏడాదికి తన నుంచి మూడు సినిమాలైనా థియేటర్లకు వెళ్లాలనే ఒక నియమం పెట్టుకున్న రవితేజ, చాలా తక్కువ సార్లు మాత్రమే ఆ విషయంలో విఫలమయ్యాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ఖిలాడి' కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించకపోయినా, ఆయన ఈ సమయాన్ని కూడా వృథా చేయడం లేదు. వరుసగా కథలను వింటున్నాడని అంటున్నారు. అలా తాజాగా ఒక యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఆ దర్శకుడి పేరే .. వంశీకృష్ణ.


మంచు లక్ష్మీ - అడివి శేష్ కాంబినేషన్లో 'దొంగాట' సినిమా చేసిన వంశీ కృష్ణ, ఇటీవల రవితేజను కలిసి ఒక కథను వినిపించాడట. ఇంతవరకూ తాను చేయని జోనర్ కావడంతో .. తాను టచ్ చేయని పాత్ర కావడంతో రవితేజ చాలా ఆసక్తిని చూపించాడట. తప్పకుండా చేద్దామనీ .. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి చెప్పమని అన్నాడట.

 దాంతో ఆ కుర్రాడు అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. త్రినాథరావు నక్కిన .. శరత్ మండవ సినిమాల తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు. ఇక మారుతి దర్శకత్వంలోను ఆయన ఒక సినిమా చేసే చాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.
Raaviteja
Vamsi Krishna
Maruthi

More Telugu News