Edward Zuckerberg: పని ఒత్తిడిలో తిండి మర్చిపోయానన్న మార్క్ జుకర్ బర్గ్... వడ్డించడానికి అమ్మ గానీ, నేను గానీ రావాలా? అంటూ తండ్రి వ్యాఖ్యలు

Edward Zuckerberg comments on his son Mark Zuckerberg post in Facebook
  • ఫేస్ బుక్ లో జుకర్ బర్గ్ ఆసక్తికర పోస్టు
  • ఒక్కోసారి తిండి మర్చిపోతుంటామని వెల్లడి
  • ఇలాంటి అనుభవం ఎదురైందా అంటూ నెటిజన్లకు ప్రశ్న
  • గత నెలలో తాను 10 పౌండ్ల బరువు తగ్గానని వెల్లడి
  • స్పందించిన తండ్రి ఎడ్వర్డ్ జుకర్ బర్గ్
ఏదైనా పనిలో పూర్తిగా లీనమైనప్పుడు తిండి వేళను కూడా మర్చిపోతుండడం సహజమే. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనిపై ఆయన నెటిజన్లను ప్రశ్నించారు.

"మీరెప్పుడైనా మిమ్మల్ని ఉద్విగ్నతకు గురిచేసేంత పనిలో పడిపోయి తినడం మర్చిపోయారా? ఆ పని మిమ్మల్ని బాగా ఉత్తేజానికి గురిచేసిందా?" అని అడిగారు. తమ నూతన ఆవిష్కరణలకు సంబంధించి గత నెలలో తీవ్రమైన మేధోమథనం చేశామని, దాంతో కొన్ని సందర్భాల్లో తిండి తినడం కూడా మర్చిపోయానని జుకర్ బర్గ్ వెల్లడించారు. తత్ఫలితంగా 10 పౌండ్ల బరువు తగ్గిపోయానని వాపోయారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో వెల్లడించారు.

జుకర్ బర్గ్ పోస్టులపై ఆయన తండ్రి ఎడ్వర్డ్ జుకర్ బర్గ్ సరదాగా స్పందించారు. భోజనం అందించడానికి అమ్మ గానీ, నేను గానీ రావాలా? అని బదులిచ్చారు. ఎడ్వర్డ్ కామెంట్ కు ఫేస్ బుక్ లో లైకులు, రిప్లయ్ లు వెల్లువెత్తాయి. 69 వేల మంది లైక్ చేయగా, 3 వేలకు పైగా రిప్లయ్ లు వచ్చాయి.
Edward Zuckerberg
Mark Zuckerberg
Facebook
Post

More Telugu News