Ashwin Yadav: గుండెపోటుతో కన్నుమూసిన హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్

Hyderabad former Ranji cricketer Ashwin Yadav dies of heart attack

  • హైదరాబాదు క్రికెట్ వర్గాల్లో విషాదం
  • అకాల మరణం చెందిన అశ్విన్ యాదవ్
  • 2007లో రంజీల్లో అడుగుపెట్టిన అశ్విన్ యాదవ్
  • 14 మ్యాచ్ ల్లో 34 వికెట్లు
  • 2009లో కెరీర్ ముగింపు

హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు అశ్విన్ యాదవ్ గుండెపోటుతో మరణించాడు. అశ్విన్ యాదవ్ వయసు 33 సంవత్సరాలు. యాదవ్ కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 2007లో అశ్విన్ యాదవ్ దేశవాళీల్లో ఫాస్ట్ బౌలర్ గా తన ప్రస్థానం ప్రారంభించాడు. 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. 6/52 అతని కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు. 2009లో అతడి కెరీర్ ముగిసింది.

అశ్విన్ యాదవ్ మృతి పట్ల హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సారథి ఆర్. శ్రీధర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ సంతాపం తెలియజేసింది. హైదరాబాద్ క్రికెట్ సెలెక్టర్, మాజీ ఆటగాడు నోయెల్ డేవిడ్ స్పందిస్తూ... అశ్విన్ యాదవ్ ఎంతో మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. అశ్విన్ యాదవ్ గుండెపోటుతో మరణించాడన్న వార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News