Mumbai: ముంబయిలో ఫలిస్తున్న ఆంక్షలు?.. తగ్గుముఖం పట్టిన కేసులు!

Is Lockdown working out in Mumbai
  • మూడు వారాల కనిష్ఠానికి కొత్త కేసులు
  • నిన్నటితో పోలిస్తే 20 శాతం తగ్గుదల
  • మహారాష్ట్ర వ్యాప్తంగానూ తగ్గుముఖం పట్టిన కేసులు
  • మరణాల్లో ఎలాంటి మార్పు లేదు
దేశ వాణిజ్య రాజధానిగా పిలిచే ముంబయి మహానగరంలో కరోనా కేసులు మూడు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. శనివారం 5,888 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 4న నమోదైన 11,163 కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 50 శాతానికి తగ్గింది.

మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగానూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలోనే మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. నేడు 67,160 కేసులు వెలుగులోకి వచ్చాయి. ముంబయిలో నిన్నటితో పోలిస్తే కేసులు 20 శాతం తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 15 శాతానికి పడిపోయింది. అయితే, మరణాల సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. ఈరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వ యంత్రాంగం కేసుల తగ్గుదలను విజయంగానే భావిస్తోంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫలిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్‌ అని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పరిస్థితులు మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా కదలికలు తగ్గి కరోనా తగ్గుముఖం పట్టిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Mumbai
Lockdown
Corona Virus
Maharashtra

More Telugu News