Mohan M Shantanagoudar: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూత

Sitting SC Judge Justice Mohan M Shantanagoudar passes away

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శాంతనగౌడర్
  • 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు
  • అంతకుముందు కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు

గత  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ (63) కన్నుమూశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.

ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్‌కు చెందిన జస్టిస్ శాంతనగౌడర్ 17 ఫిబ్రవరి 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 మే 2023న రిటైర్ కావాల్సి ఉంది.1980లో అడ్వకేట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులు చేపట్టేవారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శాంతనగౌడర్ 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడానికి ముందు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News