Sachin Tendulkar: ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన సచిన్ టెండూల్కర్
- గత నెల 27న కరోనా బారిన సచిన్
- ఈ నెల 8న డిశ్చార్జ్
- నిన్న 48వ బర్త్ డే జరుపుకున్న దిగ్గజ క్రికెటర్
కరోనా మహ్మమారి కోరల నుంచి బయటపడిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. గత నెల 27న సచిన్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరిన సచిన్ ఈ నెల 8న డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం 48వ పుట్టిన రోజు జరుపుకున్న సచిన్ తాజాగా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చాడు.
తాను మొత్తం 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపిన సచిన్.. కరోనా రోగుల కోసం త్వరలో ప్లాస్మాను దానం చేయనున్నట్టు తెలిపాడు. కాగా, వైరస్ నుండి కోలుకున్నాక 14 రోజుల్లోపు ఎలాంటి లక్షణాలు లేకుంటే ప్లాస్మాను దానం చేయవచ్చు.