USA: అతి త్వరలోనే భారత్​ కు సాయం.. అమెరికా ప్రకటన

America Extends Support to India

  • భారత్ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి
  • అత్యున్నత స్థాయిలో చర్చిస్తున్నామన్న శ్వేతసౌధం
  • త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటన

కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న భారత్ కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. భారత్ లో పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. కరోనా తీవ్రత గురించి  భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నామని చెప్పారు. త్వరగా భారత్ కు సాయం చేస్తామని ప్రకటించారు.

ఇదే విషయాన్ని శ్వేత సౌధం అధికార ప్రతినిధి వెల్లడించారు. వెంటనే భారత ప్రభుత్వానికి, ఆరోగ్య సిబ్బందికి ‘అదనపు సాయం’ చేస్తామని ప్రకటించారు. దీనిపై అత్యున్నతస్థాయిలో చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భారత్ కు సాయంపై మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. భారత్ లో పరిస్థితిపై 24 గంటలూ సమీక్షిస్తున్నామని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News