Komatireddy Venkat Reddy: ఓ ప్రజాప్రతినిధికే సరైన కరోనా వైద్యం అందక మరణిస్తే... సామాన్యుల పరిస్థితి ఏంటి?: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy fires on Telangana govt after a village sarpanch died with corona

  • తెలంగాణలో కరోనా బీభత్సం
  • గత 24 గంటల్లో 38 మంది బలి
  • ఓ గ్రామ సర్పంచి మరణించిన విషయాన్ని ఎత్తిచూపిన కోమటిరెడ్డి
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామ సర్పంచి చెక్కిళ్ల మాధవి కరోనాతో మృతి చెందారని వెల్లడించారు. ఓ ప్రజాప్రతినిధే సరైన కరోనా వైద్యం అందక మరణిస్తే, రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతోందని విమర్శించారు.

కరోనా నివారణ, చికిత్స అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోనూ చికిత్స అందేలా చూడాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను డిమాండ్ చేశారు. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38 మంది కరోనాతో చనిపోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News