Tesla: ముంబయిలో టెస్లా భారత విభాగ ప్రధాన కార్యాలయం

Teslas head quarter will be in Mumbai

  • టెస్లా భారత ప్రవేశానికి రంగం సిద్ధం
  • కర్ణాటకలో తయారీ కేంద్రం
  • ముంబయిలోని లోయర్‌ పరేల్‌-వోర్లీలో హెడ్‌ ఆఫీస్‌
  • ఇప్పటికే ఉన్నత స్థాయి ఉద్యోగుల నియామకం పూర్తి

విద్యుత్‌ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటకలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయిలోని లోయర్‌ పరేల్‌-వోర్లీ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

టెస్లా ఇప్పటికే భారత్‌లో సంస్థకు కావాల్సిన ఉన్నత స్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టింది. ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. మనూజ్‌ ఖురానాను భారత్‌లో టెస్లా పాలసీ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌గా నియమించుకున్నారు. గతంలో ఏథర్‌ ఎనర్జీలో పనిచేసిన నిషాంత్‌ ప్రసాద్‌ను ఛార్జింగ్‌ మేనేజర్‌గా.. వాల్‌మార్ట్‌, రిలయన్స్‌ రిటైల్‌లో పనిచేసిన అనుభవం ఉన్న చిత్రా థామస్‌ను హెచ్‌ఆర్‌ లీడర్‌గా ఎంపిక చేసుకున్నారు.

గతవారం జరిగిన రైజీనా డైలాగ్‌ 2021 సదస్సులో ప్రసంగించిన రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. భారత్‌లో తయారీ ప్రారంభించాలని టెస్లాను ఆహ్వానించారు. టెస్లాకు ఇదొక సువర్ణావకాశమని తెలిపారు. స్థానికంగా ఉత్పత్తి చేయడం వల్ల టెస్లా సైతం లాభపడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News