Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం ఎంతో తెలుసా..?
- సుందర్ పిచాయ్ కు భారీ ప్యాకేజి
- గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైనం
- 2019లో ఆల్ఫాబెట్ బాధ్యతల స్వీకరణ
- 2020లో మొత్తం రూ.52 కోట్లు అందుకున్న పిచాయ్
గూగుల్ తో పాటు దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ గతేడాది అదిరిపోయే రీతిలో వార్షిక వేతనం అందుకున్నారు. తొలుత గూగుల్ సీఈవోగా నియమితుడైన పిచాయ్, 2019లో ఆల్ఫాబెట్ కంపెనీ బాధ్యతలు కూడా చేపట్టారు. 2019లో రూ.4.8 కోట్ల మేర వేతనం అందుకున్న పిచాయ్ 2020లో అంతకు మూడు రెట్ల వేతనం దక్కించుకున్నారు.
గూగుల్ సంస్థ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ వద్ద నమోదు చేసిన వివరాల ప్రకారం... గతేడాది ఆయన కనీస వేతనం రూ.15 కోట్లు కాగా, అన్ని భత్యాలతో కలుపుకుని రూ.52 కోట్లు చెల్లించినట్టు వెల్లడైంది. వేతనం ఒకెత్తయితే, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవోగా నియమితుడయ్యాక 240 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను కానుకగా అందుకోవడం మరో ఎత్తు.