India: 2 వారాలపాటు భారత్‌తో ఉన్న సరిహద్దుల మూసివేత: బంగ్లాదేశ్ ప్రకటన
- భారత్‌లో కరోనా కరాళనృత్యం చేస్తుండడంతో నిర్ణయం
- మంత్రి అబ్దుల్ ఒమెన్ ప్రకటన
- సరిహద్దుల వెంట జన సంచారాన్ని నిలిపివేస్తున్నాం
భారత్‌లో కరోనా కరాళనృత్యం చేస్తుండడంతో మన దేశం నుంచి విమాన ప్రయాణాల వంటి వాటిపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ మధ్య విమాన ప్రయాణాలు ఏప్రిల్ 14 నుంచే రద్దయ్యాయి. తాజాగా, బంగ్లాదేశ్ రెండు వారాలపాటు భారత్‌తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ ఒమెన్ ఓ ప్రకటన చేశారు.
అలాగే, సరిహద్దుల వెంట జన సంచారాన్ని నిలిపివేయడంతో పాటు వాహన ప్రయాణాలను కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, దేశంలో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడంతో పలు దేశాలు భారత్ నుంచి తమ దేశానికి కరోనా వ్యాప్తి చెందకుండా విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.