Aditya Jayan: నిద్రమాత్రలు మింగి, చేతి నరాలను కట్ చేసుకున్న మలయాళ నటుడు ఆదిత్య జయన్!

Sucide Attempt by Malayala Actor Aditya
  • పలు సీరియల్స్ లో నటించిన ఆదిత్య
  • భార్య అంబిలితో ఇటీవల వివాదం
  • ప్రస్తుతం విషమంగా ఆరోగ్య పరిస్థితి
మలయాళ నటుడు, పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య జయన్, ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం ప్రాణాలతో  పోరాడుతున్నాడు. కారులో కూర్చుని అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆదిత్య, ఆపై చేతి నరాలను కోసుకున్నాడని తెలుస్తోంది. ఆపై అతను అపస్మారక స్థితికి చేరడంతో గమనించిన కొందరు త్రిచూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదిత్యకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నామని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇటీవల ఆదిత్య జయన్, ఆయన భార్య నటి అంబిలి మధ్య భేదాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన అంబిలి, భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించగా, ఆదిత్య వాటిని ఖండించాడు. తన ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తున్న ఆమె, వ్యక్తిగత విభేదాలను దృష్టిలో పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

వీరిద్దరి మధ్యా ఇలా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆదిత్య ఆత్మహత్యకు ప్రయత్నించడం గమనార్హం. 'సీత' పేరిట నిర్మితమైన ఓ సీరియల్ లో కలసి నటించిన వీరిద్దరూ, 2019లో వివాహం చేసుకోగా, వారికి అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు. ఆదిత్య మూడు పెళ్లిళ్ల తరువాత అంబిలిని వివాహం చేసుకోగా, అంబిలి అప్పటికే తన మొదటి భర్తకు దూరంగా గడుపుతూ ఆదిత్యకు దగ్గరైంది.  ప్రస్తుతం ఆదిత్య రెండు సీరియల్స్ లో నటిస్తున్నాడు.

Aditya Jayan
Ambili
Malayalam
Actor

More Telugu News