Ford: కార్ల ధరలను పెంచిన ఫోర్డ్.. ఈరోజు నుంచే అమల్లోకి కొత్త ధరలు!
- రూ. 3 వేల నుంచి 80 వేల వరకు పెరిగిన కార్ల ధరలు
- ధరలను పెంచడానికి గల కారణాన్ని వెల్లడించని ఫోర్డ్
- ఇన్ పుట్, ట్రాన్స్ పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్లే అంటున్న మార్కెట్ నిపుణులు
మన దేశంలో ఫోర్డ్ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. అయితే, ఈరోజు నుంచి ఫోర్డ్ కార్లు మరింత ప్రియంగా మారాయి. వివిధ వేరియంట్లపై ఫోర్డ్ ధరలను పెంచింది. వేరియంట్లను బట్టి రూ. 3,000 నుంచి రూ. 80,000 వరకు ధరలను పెంచేసింది. ధరలు పెరిగిన కార్లలో ఫోర్డ్ ఫిగో, యాస్పైర్, ఇకోస్పోర్ట్, ఎండీవర్ ఉన్నాయి. అయితే, ధరలను పెంచడానికి గల కారణాన్ని మాత్రం ఫోర్డ్ యాజమాన్యం వెల్లడించలేదు. ఇన్ పుట్ కాస్ట్, ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చులు పెరగడం వల్లే ధరలను పెంచినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఫోర్డ్ కారుల ధరలు ఎంత పెరిగాయంటే?:
ఫిగో: రూ. 18 వేలు.
యాస్పైర్: రూ. 3 వేలు.
ఇకోస్పోర్ట్: రూ. 20 వేలు
ఎండీవర్: రూ. 80 వేలు.
వాహనాల ధరలను ఫోర్డ్ మాత్రమే పెంచలేదు. టయోటాతో పాటు, పలు ద్విచక్ర వాహన కంపెనీలు కూడా ధరలను పెంచాయి. ఇతర మోడల్ కార్ల ధరలను త్వరలోనే పెంచుతామని ఫోర్డ్ ప్రకటించింది.